భీమ్లా నాయక్ సినిమాలో ఆ పాట పాడిన మొగులయ్య ఎవ‌రో తెలుసా

Do you know Mogulaiah who sang in the movie Bhimla Nayak?

0
93

భీమ్లా నాయక్ సినిమాలో న‌టిస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ . ఆయ‌న పుట్టిన రోజున ఈ సినిమాలోని
టైటిల్ సాంగ్ విడుద‌ల చేశారు. ఎక్క‌డ చూసినా ఇప్పుడు ఈ సాంగ్ వినిపిస్తోంది. సాంగ్ చాలా అద్భుతంగా వ‌చ్చింది. ప్ర‌తీ అభిమాని టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ సాంగ్ చాలా బాగుందని చెబుతున్నారు. అయితే ఈసాంగ్ లో క‌నిపించిన ఆ పాట పాడిన వ్య‌క్తి ఎవ‌రు అని అభిమానుల‌తో పాటు చాలా మంది నెటిజ‌న్లు తెలుసుకోవాల‌నుకుంటున్నారు.

ఈ పాటకి యూట్యూబ్ లో పది గంటల్లోనే 58 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
నల్లమల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఈ సినిమాలో పాడే అవ‌కాశం రావ‌డంతో మొగ‌ల‌య్య చాలా ఆనందంగా ఉన్నారు.

అంతరించిపోతున్న కిన్నెర వాయిద్య కళను కాపాడుతున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు 8 వ త‌ర‌గ‌తి పాఠ్యాంశాల్లో
మొగులయ్యపై ప్రత్యేకంగా ఓ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవుసలికుంట ఆయ‌న గ్రామం. మొగులయ్య తండ్రి ఎల్లయ్య నుంచి ఈ కళను వారసత్వంగా పొందాడు.
ఏడు మెట్ల కిన్నెరను పన్నెండు మెట్లుగా మార్చి ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఇత‌ని ప్ర‌తిభ తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నేరుగా ఆయ‌న‌తో మాట్లాడి ఇందులో పాట పాడించారు. ఇక ఈపాట‌ని స్పెష‌ల్ గా త‌మిళ‌నాడు అడ‌వుల్లో షూట్ చేశారు