రోహిత్ శర్మ, రితికా లవ్ స్టోరీ తెలుసా – యువరాజ్ కి రితికా ఏమవుతుందో తెలుసా

Do you know Rohit Sharma, Ritika love story

0
86

కొన్ని జంటలని చూడగానే చూడచక్కని జంటలు అనిపిస్తారు. అలాంటి వారిలో ఓ జంట భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, రితికా సింగ్ దంపతులు. వీరిని అందరూ క్యూట్ కపుల్ అంటారు. ముంబై లో పుట్టి పెరిగిన తెలుగుకుర్రాడు రోహిత్ శర్మ. మరి వీరి ప్రేమ గురించి తెలుసుకుందాం. చాలా మందికి తెలియదు హిట్రో మ్యాన్ రోహిత్ శర్మకు రితికా సింగ్ మేనేజర్ గా పనిచేశారని. ఈ సమయంలో వీరిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు అక్కడ నుంచి వీరి ప్రేమ చిగురించింది. చివరకు పెద్దల సమక్షంలో 2015లో పెళ్లి చేసుకున్నారు.

ఓ యాడ్ షూట్ సమయంలో వీరిద్దరికి పరిచయం జరిగింది. రితిక భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు సోదరి వరుస అవుతుంది. రోహిత్ శర్మ ను రితికకు దూరంగా ఉండమని యువరాజ్ సింగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ సమయంలో ఆమె అతనికి మేనేజర్ అయింది. ఇక వీరిద్దరూ డేట్ లో ఉన్న విషయం చాలా సీక్రెట్ గా ఉంచారు.

అయితే తను నా దగ్గర మేనేజర్ గా చేరిన సమయంలో మా ఇద్దరి మధ్య వర్క్ కి సంబంధించిన రిలేషన్ ఉంది. కాని మమ్మల్ని చూసిన వారు అందరూ మీ జంట బాగుంది పెళ్లి చేసుకోండని చెప్పేవారు. కానీ తర్వాత ఆ రిలేషన్ ప్రేమ అయిందని చెప్పారు రోహిత్. ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న బొరివలీ స్పోర్ట్ గ్రౌండ్లో రోహిత్ శర్మ రితికకు ప్రపోజ్ చేశాడు.
2015 డిసెంబరు 13న ముంబయిలోని తాజ్ లాండ్స్ హోటల్లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకి సమైరా అనే ముద్దుల కూతురు ఉంది.