సచిన్ అంజలి లవ్ స్టోరీ తెలుసా – వారిద్దరూ ఎలా కలుసుకున్నారంటే

Do you know Sachin Anjali love story

0
105

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ కి గాడ్ గా పిలుస్తాం. ఆయనకి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక డాక్టర్ అంజలికి సచిన్ అంటే ఎంతో ఇష్టం అభిమానం. 20 ఏళ్లకే సచిన్ ఎంతో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.తన కన్న 6 ఏళ్ల వయస్సులో పెద్దది అయినా అంజలినీ వివాహం చేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్.
ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఇలా వీరి పెళ్లి జరిగింది.

1990లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్. అక్కడ ఎయిర్ పోర్ట్ కి అంజలి తల్లిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది. అప్పుడు అంజలిని చూసి మనసుపారేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ కూడా ఒక పార్టీలో కలుసుకున్నారు. ఇక అంజలి సచిన్ కలిసి ఓసారి మూవీకి వెళ్లారు. అక్కడ జనం చూస్తే గుమిగూడతారని సినిమా మధ్యలో ధియేట‌ర్ లోకి వెళ్లాడు సచిన్. కాని జనం అతనిని చూశారు. దీంతో జ‌నం పెద్ద ఎత్తున గుమిగూడారు. అతని ఫాలోయింగ్ చూసి అంజ‌లి షాక్ అయింది.

తనను ఇంటర్వ్యూ పేరుతో ఇంటికి తీసుకెళ్లాడని, ఓ జర్నలిస్టులా తన తల్లితండ్రులకు పరిచయం చేశాడని అతని సతీమణి అంజలి తెలిపింది. 1995 మే 24న ఈ జంట ఒక్కటైంది. అయితే సచిన్ ని ముందు చూసిన సమయంలో తను ఎవరో నాకు తెలియదు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మేము కలిశాం. టెలిఫోన్ లో మాట్లాడుకునేవాళ్లం ప్రేమలేఖలు రాసుకున్నామని అంజలి త‌మ ప్రేమ రోజులు తెలిపింది.