క్రికెటర్ షమీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

Do you know these things about cricketer Shami?

0
76

ఎప్పుడూ ఎవరి పరిస్దితి ఒకేలా ఉండదు ఈ రోజు బాధలు ఉండవచ్చు అవి కేవలం కొద్ది సేపు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. ముందు ముందు మంచి రోజులు రావచ్చు. ఇలా సక్సస్ అయిన వారు కొన్ని లక్షల మంది ఉన్నారు మన దేశంలో.
క్రికెట్ లోకి రాకముందు చాలా పేదరికాన్ని అనుభవించాడు షమీ. కానీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు అతని లైఫ్ మారింది అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అతనికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. తిరుగులేని క్రేజ్ తో పేరు ప్రఖ్యాతులు సంపాందించాడు. క్రికెటర్ కాకముందు షమీకి ఎన్నో ఆర్ధిక కష్టాలు ఉన్నాయి. చిన్న ఇంటిలో ఉండేవాడు. ఇప్పుడు పెద్ద భవంతి కొనుక్కున్నాడు. టయోటా ఫార్చ్యూనర్, BMW మరియు ఆక్సన్ ఆడి వంటి కార్లు ఉన్నాయి.

షమీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్ల రూపాయలు ఉంటుంది అంటారు. ఎంతో కష్టపడి ఈ స్ధాయికి వచ్చిన వ్యక్తిగా ఆయన్ని అందరూ అభిమానిస్తారు. చాలా మంది యూత్ కి ఇన్ స్పిరేషన్ అయ్యాడు. 2014 ఏప్రిల్ 7 న భార్య హసీన్ జహాన్ ని వివాహం చేసుకున్నాడు మహ్మద్ షమీ. కానీ చాలా కాలం నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. 2018లో హాసిన్ వేధింపుల కేసు కూడా పెట్టింది.