టెస్ట్​ ఛాంపియన్​షిప్​ పట్టికలో భారత్​ స్థానం ఎన్నంటే?

Do you know where India is in the Test Championship table?

0
88

తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాపర్​గా శ్రీలంక నిలిచింది. టీమ్ఇండియా​ రెండో ర్యాంకులో ఉంది. భారత్​కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం ఆధారంగా ప్రస్తుతానికి శ్రీలంకకే అగ్రస్థానం దక్కింది.

తాజాగా వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్ట్​ మ్యాచ్​లో 187పరుగుల తేడాతో విజయం సాధించింది లంక జట్టు. ఈ ఫలితంతోనే పాయింట్ల పట్టికలో ముందంజలో నిలిచింది. ప్రస్తుతం శ్రీలంక(12 పాయింట్ల, గెలుపు శాతం 100), టీమ్​ఇండియా(26, 54.17%), పాకిస్థాన్​(12, 50%), వెస్టిండీస్​(12, 33.33%), ఇంగ్లాండ్​(14, 29.17%) తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్​ ఆడిన వెస్టిండీస్​ 160 పరుగులకే కుప్పకూలింది. విండీస్​ ప్లేయర్స్​లో కుమ్రా బానర్​(68), జాష్వా డిసిల్వా (54) తప్ప మిగతా వారు విఫలమయ్యారు. లంక బౌలర్లలో రమేశ్​ మెండిస్​ 5, లసిత్​ ఎంబుల్డేనియా 4, ప్రవీన్​ జయవిక్రమ ఓ వికెట్​ను దక్కించుకున్నారు.