జావెలిన్ త్రో క్రీడ ఎక్క‌డ మొద‌లైందో తెలుసా

Do you know where the sport of javelin throw started?

0
107

ఇప్పుడు ఎక్క‌డ చూసినా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా పేరు వినిపిస్తోంది. ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించాడు. అథ్లెటిక్స్‌లో దేశం తరఫున సాధించిన మొదటి బంగారు పతకం ఇదే .అస‌లు చాలా మంది ఈ జావెలిన్ త్రో మ‌నకు ఎప్పుడు స్టార్ట్ అయింది మ‌నదేశంలో ఎలా వ‌చ్చింది ఇవ‌న్నీ తెల‌సుకుంటున్నారు. ఇది ఎప్ప‌టిదో పురాత‌న క్రీడ‌.

మెటల్ టిప్ ఉన్న ఈటెను వీలైనంత దూరం విసరడానికి అథ్లెట్లు ప్రయత్నిస్తారు. పూర్వం రాజుల కాలంలో యుద్దాల స‌మ‌యంలో విన్యాసాల స‌మ‌యంలో ఈ క్రీడ ఉండేది. జావెలిన్ గ్రిప్ ఉన్న చోట దాన్ని పట్టుకొని విసరాల్సి ఉంటుంది.
ఇక స‌రైన కొల‌త‌లు నిర్దిష్ట‌ప‌రిమాణంలో దీనిని త‌యారు చేస్తారు.

పురుషుల జావెలిన్ 2.6 నుంచి 2.7 మీటర్ల పొడవు 800 గ్రాముల బ‌రువు ఉండాలి. అలాగే మహిళలు ఉపయోగించే జావెలిన్ 600 గ్రాముల బరువు, 2.2 మీటర్ల నుంచి 2.3 మీటర్ల పొడవు ఉండాలి. ఇక ఈ క్రీడ‌ని 1908లో ప్ర‌వేశ పెట్టారు
ఒలింపిక్స్ లో… చెకోస్లోవేకియా అథ్లెట్ జాన్ జెలెనీ అందరి కంటే అత్యుత్తమ ఆటగాడిగా పేరు సాధించాడు.
1996 విశ్వక్రీడల్లో 98.48 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డ్ సాధించాడు. జావెలిన్ చాలా జాగ్ర‌త్త‌గా ఏకాగ్ర‌త‌త‌లో వ‌ద‌లాలి. అది ఎంత స్పీడ్ వెళుతుంది అనేది వ‌దిలే ఆఖ‌రి సెకన్ పైనే ఆధార పడి ఉంటుంది. అందుకే ఎంతో క‌ఠోర శిక్ష‌న ఉంటుంది.