అప్పటివరకు నన్ను తీసుకోకండి..హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Don't take me till then..Hardik Pandya Interesting comments

0
112

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య ఫామ్ లేమితో బాధపడుతున్న ఈ క్రికెటర్ ప్రస్తుతం ఫిట్​నెస్​పై ధ్యాస పెట్టినట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా చాలా కాలంగా బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న పాండ్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్​లోనూ హార్దిక్​కు చోటు లభించడం కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల వరకు తనను పరిగణలోకి తీసుకోవద్దని సెలక్టర్లను కోరినట్లు సమాచారం. పూర్తి ఫిట్​నెస్​ సాధించాకే జట్టులోకి తిరిగి వస్తానని వారితో అతడు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఆల్ రౌండర్ గా పేరున్న హార్దిక్ బౌలింగ్ చేయలేకపోవడం ఇండియాకు అతి ప్రధాన సమస్యగా మారింది. దీనితో ఆరో బౌలర్ కరువయ్యాడు. హార్దిక్ కు ప్రత్యామ్నాయంగా శార్ధూల్, దీపక్ చాహర్ ఉన్నప్పటికీ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉండడం హార్దిక్ కు సానుకూలాంశం. హార్దిక్ పూర్తి ఫిట్ నెస్ సాధించి తనపై వస్తున్న విమర్శలకు తన ఆటతోను సమాధానం ఇస్తాడో లేదో చూడాలి మరి.