ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇప్పటికే చెన్నై ప్లే ఆప్స్ కు అర్హత సాధించగా..టాప్ 2 లో నిలవడానికి పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో గెలవాలనే ధీమాతో ఉన్నారు. మరో మ్యాచ్ లో రాజస్థాన్ ఇప్పటికే ఇంటిబాట పట్టగా వారికి ఇది నామమాత్రపు మ్యాచ్.
కోల్ కతా ఈ మ్యాచ్ లో గెలిచి ఫోర్త్ ప్లేస్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. కేకేఆర్ గెలిస్తే వారికి డోకా ఉండదు కానీ ఓడిపోతే నెట్ రన్ రేట్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది.