టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ద్రవిడ్‌కు ప్రతిష్టాత్మకమైన ఐసిసి హాల్ ఆఫ్ ఫ్రేమ్‌లో చోటు లభించింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న ఐదో భారత క్రికెటర్‌గా ద్రవిడ్ నిలిచాడు. ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికి పాంటింగ్, ఇంగ్లండ్ మహిళా జట్టు క్రికెటర్ క్లెయిర్ టైలర్‌లకు కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించారు. ఈ విషయాన్ని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్‌సన్ అధికారికంగా ప్రకటించారు. కాగా గతంలో భారత క్రికెటర్లు బిషన్ సింగ్ బేడి, కపిల్‌దేవ్, సునిల్ గవాస్కర్, అనిల్ కుంబ్లేలకు ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన క్రికెటర్లకు ఈ అవార్డుతో సత్కరించడం అనవాయితీగా వస్తోంది. తాజాగా ద్రవిడ్ కూడా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంపై ద్రవిడ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇది తన జీవితంలోనే అత్యంత అరుదైన అంశమన్నాడు. ప్రతి క్రికెటర్ కూడా ఇందులో చోటు సంపాదించాలని భావిస్తాడని, తనకు ఈ అరుదైన గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.
ద్రవిడ్‌కు అరుదైన గౌరవం
ద్రవిడ్‌కు అరుదైన గౌరవం