దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విషయంపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమ్‌ఇండియా రెండో టెస్టులో ఓటమి పాలయ్యాక ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పంత్ బ్యాటింగ్ తీరుపై నోరు విప్పాడు.
“పంత్ సానుకూలంగా ఉండే ఆటగాడని మనందరికీ తెలిసిందే. అతడు ఆడే వైవిధ్యమైన తీరుతోనే విజయవంతమయ్యాడు. అయితే, కొన్నిసార్లు షాట్ల ఎంపికలో ఇబ్బందిపడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ విషయంపై అతడితో కలిసి చర్చిస్తాం. ఈ మ్యాచ్‌లో షాట్ సెలెక్షన్ టైమింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే ఔటయ్యాడు. షాట్ల ఎంపిక అనేది కేవలం టైమింగ్‌కు సంబంధించిందే.”
ఎవరైనా ఆటగాడు క్రీజులోకి రాగానే కాస్త సమయం తీసుకుని పరిస్థితులను అర్థం చేసుకుని ఆడాలనుకోవడం మంచి పరిణామం. పంత్ విషయంలో ఏం జరుగుతుందో మేం అర్థం చేసుకున్నాం. అతడో పాజిటివ్ ప్లేయర్. తన ఆటతో మ్యాచ్ ఫలితాన్నే మర్చగల సమర్థుడు. అలాంటి ఆటగాడిని తన ఆట తీరు మార్చుకోవాలని మేం చెప్పలేం. అతడు ప్రస్తుతం నేర్చుకునే దశలో ఉన్నాడు. కచ్చితంగా నేర్చుకుంటాడు” అని ద్రవిడ్ తన ఆలోచనలు పంచుకున్నాడు.