ఫ్లాష్- మధ్యప్రదేశ్ లో భూకంపం

0
93

మధ్యప్రదేశ్​​లో భూకంపం కలకలం రేపింది.  ఇండోర్ లో గురువారం ఉదయం 4.53 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది. రిక్టర్ స్కేల్​పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు పరుగులు తీశారు.