ఈ విషయంలో కోహ్లీ కి కొత్త చిక్కులు ఏం చేస్తాడో

ఈ విషయంలో కోహ్లీ కి కొత్త చిక్కులు ఏం చేస్తాడో

0
114

క్రికెట్ మ్యాచ్ గెలవాలి అంటే కచ్చితంగా టీమ్ అందరూ కలిసి సమిష్టిగా ఆడితేనే గెలుపు వస్తుంది… టీమ్ లో ఒక్క ఆటగాడు సరిగ్గా ఆడకపోయినా అది టీమ్ గెలుపుపై ప్రభావం చూపిస్తుంది.. ఒక్క బాల్ ఒక్క షాట్ మ్యాచ్ ని మార్చిన సందర్బాలు ఉన్నాయి..సరిగ్గా ఆడక మ్యాచ్ పోగొట్టుకున్న సందర్బాలు ఉన్నాయి.ఇటీవలి కాలంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది.

ఒక్కో జట్టును చిత్తు చేస్తూ సత్తా చాటుతోంది. అన్నింటా ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ బలంగా ఉంది. రోహిత్ శర్మతో కూడిన టాప్ ఆర్డర్ భారీ స్కోర్లకు పునాది వేస్తుండగా… స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంలో మిడిల్ ఆర్డర్ తన వంతు పాత్రను పోషిస్తోంది. అందుకే ఈ టీమ్ విషయంలో అభిమానులు కూడా ఈ ఆర్డర్ మార్చద్దు అంటున్నారు. తాజాగా కెప్టెన్ కోహ్లీకి పెద్ద తలనొప్పి వచ్చిందట ఈ విషయంలో.

ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేయడం సవాల్ గా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్ స్లాట్ ను ఎంపిక చేయడం కష్టసాధ్యంగా మారింది.ఓపెనింగ్ కు సంబంధించి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లలో ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. మరి కోహ్లీ అలాగే టీమ్ దీనిపై ఎలాంటి డెసిషన్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు, దీనిపై తాజాగా శిఖర్ దావన్ మాట్లాడారు, ముగ్గురం మంచి ఫామ్ లో ఉన్నాము అందరూ బాగా ఆడుతున్నాం కెప్టెన్ కోహ్లీ, టీమ్ మేనేజ్ మెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా ఒకే అని చెప్పాడు దావన్.