మాజీ మంత్రి ఈటల రాజేందర్ తొలిసారి సిఎం కేసిఆర్ పై తొలిసారి ఘాటైన రీతిలో కామెంట్స్ చేశారు. ఆయనను బర్తరఫ్ చేసిన నాటినుంచి కొంత సంయమనం పాటిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఢిల్ల వెళ్లి బిజెపి పెద్దలను కలిసి వచ్చారో ఇక ఈటల ఉగ్రరూపం దాల్చారు. శుక్రవారం తన నివాసంలో మాట్లాడిన ఈటల కేసిఆర్ ను టార్గెట్ చేసి గుడ్డలూడదీసే ప్రయత్నం చేశారు.
తనకు కేసిఆర్ మధ్య గ్యాప్ ఎలా వచ్చిందని చాలామంది అడుగుతున్నారని గుర్తు చేస్తూ… ఈటెల కీలక విషయాలు వెల్లడించారు. తనకు కేసిఆర్ కే కాకుండా హరీష్ రావుకు కూడా గ్యాప్ ఉందని, ఆయనను అనేకసార్లు అవమానించారని అన్నారు.
గ్యాప్ విషయంలో ఈటల ఇలా వివరించారు… నేను, కరీంనగర్ నేతలంతా ఒక సమస్య మీద ప్రగతి భవన్ కు వచ్చినము. టిఆర్ఎస్ లో 19 ఏండ్ల నుంచి ఉన్న. అన్నా అని కేసిఆర్ ను ప్రేమగా పిలిచే చనవు ఉంది నాకు. పెద్ద సమస్య కావడం, జిల్లా ప్రజా ప్రతినిధులందరం వెళ్తున్నం కాబట్టి అపాయింట్ మెంట్ తీసుకోకుండానే పోయినం. ఇంతమందిని కాదంటరా అనుకున్నం. కానీ అపాయింట్ మెంట్ లేదు కాబట్టి ప్రగతి భనవ్ కు రానీయలేదు. ఎంత అడిగాన కాదన్నారు.
మరోసారి అపాయింట్ మెంట్ తీసుకుని వచ్చినం. కానీ అప్పుడు కూడా కలవనీయలేదు. అయాంట్ మెంట్ ఉన్నా ఎందుకు రానీయలేదో నాకు అర్థం కాలేదు.
ఆ సమస్య గురించి కేసిఆర్ కు చెప్పుకునేందుకు మూడోసారి వచ్చినం. అప్పుడు అనిపించింది.. ఇంత ఉద్యమ సహచరుడిగా చనువున్నా.. ఇప్పుడు ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నారో అనుకున్నాను. అప్పటినుంచే ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవు. ఒక మంత్రి పదవి అంటే బానిస కంటే హీనంగా ఉంటదా అని నాకు అప్పుడు అనిపించింది. కుక్కిన పేనులా పడి ఉంటే ఉండాలి. ఆత్మగౌరవం చంపుకుని అక్కడ ఉండలేను అనుకన్న.
టిఆర్ఎస్ లో హరీష్ రావు కు అవమానాలు ఎలా ఉన్నాయో ఈటల కామెంట్స్ కోసం కింద వార్తను క్లిక్ చేసి చదవండి.