ఫుట్ బాల్ వాలీ బాల్ జరిగే సమయంలో అలాగే క్రికెట్ మ్యాచ్ లు జరిగే సమయంలో చాలా సందర్బాల్లో ఆ స్టేడియంలో ప్రేక్షకుల్లో కొందరు తమ ప్రేయసికి లేదా ప్రియుడికి ప్రపోజ్ చేసిన ఘటనలు చాలా చూశాం, అంతేకాదు కొన్నిఫెయిల్ అయినవి ఉన్నాయి.. అక్కడే ఎస్ చెప్పినవి ఉన్నాయి, ఇలా ప్రియురాలికి అక్కడ స్టేడియంలో అందరి ముందు ప్రపోజ్ చేసి రింగ్ తొడిగిన వారు చాలా మంది ఉన్నారు.
ఇక అక్కడ ఉన్నకెమెరాలు అవి క్లిన్ మనిపిస్తాయి, షి సెడ్ ఎస్ అనగానే వారి ఆనందం అంతా ఇంతాకాదు.. అక్కడ కామెంటరేటర్లు, క్రీడాకారులు కూడా వారికి చప్పట్లతో అభినందనలు తెలియచేస్తారు.సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరిగింది.
ఈ సమయంలో ప్రేక్షకుల్లో ఓ యువ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ టీమిండియా ఫ్యాన్ తన ఆస్ట్రేలియన్ గాళ్ ఫ్రెండ్ కు ఎంతో హృద్యంగా ప్రపోజ్ చేశాడు. ఆమె అతనికి ఎస్ చెప్పి కిస్ ఇచ్చింది, ఇద్దరూ సంతోషంగా హగ్ ఇచ్చుకున్నారు, ఇది అందరిని ఆకట్టుకుంది. వారికి అందరూ అభినందనలు తెలిపారు మన క్రికెటర్లు కూడా ఆనందంగా నవ్వుకున్నారు, చప్పట్లు కొట్టారు
మరి మీరు ఆ వీడియో చూడండి
Where dreams come true ? ❤️#LoveOurSCG #AUSvIND pic.twitter.com/MqS3XZMaig
— Sydney Cricket Ground (@scg) November 29, 2020