IPL Auction: లివింగ్​స్టోన్​ కు పండగే..మోర్గాన్​, మలన్​కు షాక్!

0
85

ఐపీఎల్ మెగా వేలంలో రెండో రోజు రసవత్తరంగా సాగుతుంది. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​, రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు లివింగ్​ స్టోన్​పై ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించాయి. అతడి కోసం చెన్నై, కోల్​కతా, పంజాబ్​ తీవ్రంగా పోటీపడ్డాయి. చివర్లో గుజరాత్​ టైటాన్స్​, సన్​రైజర్స్​ కూడా వచ్చాయి. చివరకు రూ. 11.50 కోట్ల భారీ ధరకు పంజాబ్​ సొంతమయ్యాడు.

ఆసీస్​ టెస్ట్​ ప్లేయర్​ మార్నస్​ లబుషేన్​, ఇంగ్లాండ్​ కెప్టెన్​, కేకేఆర్​ మాజీ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. ఫించ్​ కూడా అన్​సోల్డ్​గా మిగిలాడు. పుజారా, సౌరభ్​ తివారీపైనా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు.