ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా ఈరోజే..!

0
101

ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకోగా..నాలుగో స్థానం దాదాపు కోల్ కతా వశమైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే ముంబై జట్టు ప్లే ఆఫ్ రేస్ లో నిలబడుతోంది.

ఐపీఎల్‌-2021 సీజన్‌కు సంబంధించి షెడ్యూల్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. అక్టోబ‌ర్ 8న జరిగే చివ‌రి రెండు లీగ్ మ్యాచ్‌లు ఒకే సమయంలో ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌క‌టించింది. గ్రూప్ దశలో ఇలా రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో ప్రారంభం కానుండ‌టం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

షెడ్యూల్ ప్ర‌కారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ప్రారంభం కావాల్సి ఉండ‌గా..సాయంత్రం 7:30 గంట‌ల‌కు ఢిల్లీ, బెంగ‌ళూరు జట్ల మ్యాచ్ ఉంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభ‌మ‌వుతాయ‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీ ఉండటం వల్లే షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.