Flash: గుండెపోటుతో ముంబై మాజీ క్రికెటర్ మృతి..

0
103

క్రికెట్ ప్ర‌పంచంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ముంబై మాజీ క్రికెటర్, 2006-2007 రంజీ ట్రోఫీ విజేత రాజేష్ వర్మ కూడా గుండెపోటుతో మరణించి అభిమానులను షాక్ కు గురిచేసారు. 2002లో క్రికెట్ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టి 2008లో తన చివరి మ్యాచ్ ఆడి రాణించాడు. కుడి చేతి బౌలర్ గా ఆడి ఎన్నో మ్యాచ్ లను గెలిపించిన ఘనత పొందాడు.