గంగూలి సరికొత్త నిర్ణయం నాలుగు జట్ల మ్యాచ్ కు ప్లాన్ రెడీ

గంగూలి సరికొత్త నిర్ణయం నాలుగు జట్ల మ్యాచ్ కు ప్లాన్ రెడీ

0
115

ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన వర్క్ ఎలా ఉందో చేసి చూపిస్తున్నారు.. రెండు నెలలు అయే సరికి అన్నీ బోర్డులు బీసీసీఐ వైపు చూసేలా ఈ దాదా నిర్ణయాలు ఉంటున్నాయి, క్రికెట్ ని మరింత మందికి దగ్గర చేర్చేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ప్రతి ఏడాది భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మరో అగ్రజట్టుతో నాలుగు దేశాల టోర్నీ నిర్వహించాలని గంగూలీ చేసిన ప్రతిపాదనకు పెద్ద జట్ల క్రికెట్ బోర్డుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రతిపాదనకు ఎస్ చెప్పారు.

నాలుగు దేశాల పెద్ద జట్లు 2021 నుంచి క్రమం తప్పకుండా టోర్నీ నిర్వహిస్తే క్రికెట్ కు మరింత ఆదరణ లభించడం ఖాయమని గంగూలీ భావిస్తున్నాడు. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ కూడా ఎస్ చెప్పింది,ఆస్ట్రేలియా , ఇంగ్లండ్, భారత్ తో పాటు మరో దేశం ఏం ఉంటుందో చూడాలి.