రానున్న ఐపీఎల్ 2020 సందర్భంగా క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది… జియో క్రికెట్ ప్లాన్ పేరుతో 499, 777 రూపాయల ప్యాక్ లను లాంచ్ చేసింది… ఈ ప్లాన్ లో 399 రూపాయల విలువైన డిన్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచింతంగా అందిస్తోంది…
తద్వారా డిస్నీ ప్లాన్ హాట్ స్టార్ లో ఇండియా ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ ను ఆన్ లైన్ లో ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది… మైజియో యాప్ ద్వారా ఈ ప్లాన్లను అందుబాటులో ఉంచింది…
499తో రీచార్జ్ చేసుకుంటే డైలీ 1.5 జీబీ నెట్ క్రికెట్ సీజన్ మొత్తం కాలానికి 56 రోజులు అందిస్తుంది… 777తో రీచార్జ్ చేసుకుంటే డైలీ 1.5 జీబీ నెట్ జియోటు జియో కాలింగ్ ఇతర నెట్ వర్క్ లకు 3000 నిమిషాలు. డైలీ వంద ఎస్ఎమ్ఎస్ లు. దీని కాలపరిమితి 84 రోజులు