సొంత పార్టీ పెట్టే యోచనలో గులాం నబీ ఆజాద్..అందుకే కాంగ్రెస్ ను వీడారా?

0
110

కాంగ్రెస్ కు ఝలక్ ఇస్తూ రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ తదుపరి వ్యూహమేంటి? ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేక సొంత పార్టీ పెడతారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఆజాద్.. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు.

‘ఆజాద్ భాజపాలో లేదా మరే ఇతర పార్టీలో చేరరు. కొత్త పార్టీని స్థాపించే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మీరు మరిన్ని రాజీనామాలను చూస్తారు. వారందరూ ఆజాద్ వెంట నడుస్తారు.’ అని ఆజాద్ సన్నిహితుడు చెప్పుకొచ్చాడు.