గిల్​-సారా బ్రేకప్?..ఇన్​స్టా పోస్ట్ వైరల్

Gill-Sarah breakup? .. Insta post virally

0
91

టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కించుకోని యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్ ప్రస్తుతం ఇంటివద్దే విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. తరచూ సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించిన విషయాలు పంచుకునే ఇతడు.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అతడికి ఏమైందని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..

https://www.instagram.com/stories/shubmangill/?utm_source=ig_embed&ig_rid=fb8a52f3-b048-48b7-ab41-887b3b34e93c

అతను షేర్ చేసిన ఫొటోలో నలుపు రంగు టీషర్ట్​లో కనిపించిన గిల్.. ‘ఏంజెల్స్​తో ప్రేమలో పడకూడదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు అతడికి బ్రేకప్ అయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలాకాలంగా గిల్​కు సచిన్ తెందూల్కర్ తనయ సారా తెందూల్కర్​కు మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు గుసగుసలు విపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ఫొటోలతో సందడి చేశారు. తాజాగా ఈ పోస్ట్​తో వీరిద్దరికీ బ్రేకప్ అయిందని అనుకుంటున్నారు నెటిజన్లు.

టీమ్ఇండియా తరఫున వన్డే, టెస్టులకు ప్రాతనిధ్యం వహించిన గిల్​.. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 8 టెస్టులాడిన ఇతడు 414 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2021లో కోల్ కతా తరపున ఆడిన గిల్ ఆశించిన మేర రాణించాడు.