క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..అందుబాటులో వార్నర్, కమిన్స్​, మాక్స్‌వెల్

Good news for cricket fans

0
137

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా మార్చి 27 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ మొదటి మ్యాచ్ లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండరని ఆ బోర్డులు తెలిపాయి. తాజాగా క్రికెట్ ఫ్యాన్స్ కు సీఏ శుభవార్త చెప్పింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్​ ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది ఐపీఎల్​​లో పాల్గొనేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం(ఎన్​ఓసీ) మంజూరు చేసింది.

దీంతో డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్​, గ్లెన్ మాక్స్‌వెల్ స్టార్లు ఏప్రిల్​ 6 నుంచి ఐపీఎల్​కు అందుబాటులో వచ్చే అవకాశముంది. ఐపీఎల్​లో వార్నర్​, మిచెల్​ మార్ష్​.. దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనుండగా, గ్లెన్ మాక్స్‌వెల్​, జోష్ హేజిల్‌వుడ్ రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.