ధోనీ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్

Good news for Dhoni fans

0
131

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ బర్త్ డే నిన్న జరిగింది. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. నిన్న అంతా సోషల్ మీడియాలో ధోని గురించే వైరల్ అయింది. క్రికెట్ లో భారత జట్టుకు దూరమైన ధోనీ ఐపీఎల్ ద్వారా ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాడు. సీఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. తాజాగా సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ఇది విని ఫ్యాన్స్ బాగా ఖుషీ అవుతున్నారు. సీఎస్కేకు ధోనీ మరో ఏడాది లేదా రెండేళ్లు ఆడతాడని ఆయన అన్నారు. క్రికెట్ కు ధోనీ దూరం కావాల్సిన ఏ ఒక్క కారణం కూడా తనకు కనిపించడం లేదని చెప్పారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మధ్యలో ఆగిపోయింది. కరోనా సెకండ్ వేవ్ తో కేసులు పెరడంతో టోర్నీ మధ్యలో ఆగిపోయింది.

టోర్నీలో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించనున్నారు. మొత్తానికి టీమ్ ని మరో రెండు సంవత్సరాలు ఆయన ముందుండి నడిపించే అవకాశం ఉందని, ఈ మాట విని అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు