IPL ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ప్రేక్షకుల అనుమతిపై బీసీసీఐ కీలక ప్రకటన

0
117

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి.  మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి.

అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించట్లేదు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

గత సీజన్​లో​ ఛాంపియన్స్​గా నిలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​గా ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ముంబాయి, పూణేల్లో నాలుగు స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి.