బ్రేకింగ్ – ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ – టికెట్స్ ఇలా పొందండి

Good news for IPL fans - get tickets like this

0
95

సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా సెకండాఫ్ ఐపీఎల్ జరుగనుంది. ఈ మ్యాచ్ ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి అందరికి ఓ గుడ్ న్యూస్ అందించింది బీసీసీఐ.
సెకండాఫ్ ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులకు అనుమతిస్తామని ప్రకటించింది. మరి ఎంట్రీ టికెట్లకు కూడా ఓ విషయం తెలిపింది .సెప్టెంబర్ 16 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

అధికారిక వెబ్సైట్ www.iplt20.com తో పాటుగా PlatinumList.netలో కూడా టికెట్స్ అందుబాటులో ఉండనున్నట్టుగా బీసీసీఐ తెలిపింది. దీంతో ఆయా జట్ల ఫ్యాన్స్ – క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. గతేడాది ఐపీఎల్ కూడా యూఏఈలో జరిగిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు ఎవరికి స్టేడియంలోకి అనుమతి ఇవ్వలేదు. కాని ఇప్పుడు కేసులు తగ్గడం కరోనా టీకాలు వేస్తున్న కారణంగా ఆడియన్స్ కి అనుమతి ఇస్తున్నారు. (అయితే అది కూడా చాలా పరిమితం అని తెలుస్తోంది)

అక్టోబర్ 15వ తేదీన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ ప్లేయర్స్ ప్రాక్టీస్ షూరూ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్లలో ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీలో ఉన్నారు.

https://www.iplt20.com/news/238292/vivo-ipl-2021-set-to-welcome-fans-back-to-the-stadiums