బ్యాడ్మింటన్ స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు గుడ్ న్యూస్ దేశంలోనే తొలిసారి

బ్యాడ్మింటన్ స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు గుడ్ న్యూస్ దేశంలోనే తొలిసారి

0
101

మన దేశ బ్యాడ్మింటన్ స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆటలో ఆయన శైలి తెలిసిందే.. అనేక టోర్నీలు ట్రోపీలు ఆడి ఆయన గెలుచుకున్న అవార్డులు టైటిల్స్ ఎన్నో ఉన్నాయి, కోచ్ గా ఆయన శిష్యుల్ని తయారు చేస్తున్నారు, మన దేశానికి గర్వకారణమైన ఆటగాడు అనే చెప్పాలి.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి ఆయనని ఎంపిక చేసింది. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయుడు గోపీచంద్ కావడం విశేషం. మన దేశంలో ఇలా అవార్డు ఆయనే గెలుచుకున్నారు.

బ్యాడ్మింటన్ విభాగంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా పురుషుల విభాగంలో 2019వ సంవత్సరానికిగాను ఈ అవార్డు అందజేస్తున్నట్లు ఐఓసీ పేర్కొంది. దీంతో ఆయన అభిమానులు క్రీడాకారులు చాలా ఆనందంలో ఉన్నారు.. ఆయన కూడా దీనిపై చాలా ఆనందంగా ఉన్నారు..ఇది భారతీయ కోచ్లందరికీ దక్కిన గౌరవంగా భావిస్తా అని తెలిపారు.