టీ20 ప్రపంచకప్: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Good news for TeamIndia fans

0
109

పాకిస్థాన్​తో జరిగిన తొలి మ్యాచ్​లో టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య కుడిచేయి భుజానికి గాయమైంది. అయితే.. అతడు బౌలింగ్​ చేయడం ఇక కష్టమే అని అందరూ భావించారు. కానీ, బుధవారం నెట్స్​లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్, సోహమ్ దేశామ్ ఆధ్వర్యంలో 15 నిమిషాల పాటు బౌలింగ్ చేశాడు హార్దిక్. అనంతరం 20-25 నిమిషాల పాటు ఫిట్​నెస్​ డ్రిల్స్ చేశాడు.

నెట్స్​లో బ్యాటింగ్​ స్కిల్స్​పై కూడా ఫోకస్​ చేశాడు హార్దిక్. ఈ ప్రాక్టీస్​ సెషల్​ భాగంగా టీమ్​ఇండియా మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ పాండ్యకు పలు సలహాలు ఇచ్చాడు. ప్రపంచకప్​ మ్యాచ్​ల్లో హార్దిక్ కనీసం రెండు ఓవర్లైనా బౌలింగ్ చేస్తే బాగుంటుందని టీమ్ఇండియా సారథి ఇటీవలే పేర్కొన్నాడు. అయితే పాకిస్థాన్​తో మ్యాచ్​కు ముందు రానున్న మ్యాచ్​ల్లో బౌలింగ్ చేస్తానని హార్దిక్ కూడా తెలిపాడు. కానీ, అనూహ్యంగా పాక్​ మ్యాచ్​లో అతడి భుజానికి స్వల్ప గాయమైంది.

పాకిస్థాన్​తో అక్టోబరు 24న జరిగిన మ్యాచ్​లో బ్యాటింగ్​ చేస్తుండగా హార్దిక్ కుడి భుజానికి గాయమైంది. దీంతో పాక్ ఇన్నింగ్స్​లో అతడు ఫీల్డింగ్​కు రాలేదు. అతడి బదులు ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేశాడు. ఈ మ్యాచ్​లో 8 బంతుల్లో 11 పరుగులు చేశాడు హార్దిక్​.