వాట్సప్ యూజర్లకు శుభవార్త..అందుబాటులోకి కొత్త ఫీచర్..ఎలా పని చేస్తుందంటే?

0
91

వాట్సాప్ ను వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుతుంటారు. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లను తీసుకొస్తుంది మెసేజింగ్ యాప్ వాట్సప్. అప్​డేట్లను విడుదల చేయడం వాట్సాప్​ కు కొత్త కాదు. కానీ ఇప్పుడు రాబోతున్న అప్​డేట్​​ కోసం డెస్క్​టాప్​ యూజర్లు కూడా వేచి చూస్తున్నారు.

యూజర్లకు మెరుగైన సౌలభ్యం కోసం వాట్సాప్​ తరచూ అప్డేట్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది. వాట్సాప్ ప్రస్తుతం వెబ్ వాట్సాప్ వాడే వినియోగదారులకు కొత్త ఫుటర్ ఇండికేటర్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫుటర్ ఇండికేషన్ వినియోగదారులకు చాలా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఈ ఫుటర్ ఇండికేషన్​లో ఎండ్ టూ ఎండ్ మోడ్ లో మెస్సేజులను పంపనున్నట్లు తెలుస్తోంది.

డెస్క్ టాప్ లో వాట్సాప్ ను వాడుతున్న వినియోగదారులు మెస్సేజును రిసీవ్ చేసుకున్నపుడు కింది భాగంలో కనిపించనుంది. ఈ అప్డేట్ అనేది వెర్షన్ 2.2206.1.లో ఉండనుంది. ఈ వెర్షన్ ఇప్పటికే వాట్సాప్ ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్​ ను వాట్సాప్ వెబ్ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు సమాచారం

ఇన్నాళ్లూ వెబ్​లో వాట్సాప్ వాడాలంటే.. మన ఫోన్ అనేది ఆన్​లైన్​లో ఉండాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఫోన్​తో పని లేకుండా డెస్క్​టాప్​లో వాట్సాప్ వాడేలా కంపెనీ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉందని పలువురు యూజర్లు చెబుతున్నారు.