IPL 2022 ప్రోమో చూశారా? (వీడియో)

Have you seen the IPL 2022 promo? (Video)

0
102

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి.  మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. ఒక్క బెంగళూరు తప్ప మిగతా అన్ని టీంలు కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. తాజాగా IPL-2022 ప్రోమో విడుదలైంది.

టాటా ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ ఈ ప్రోమోను రూపొందించింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. కొన్నేళ్లుగా ఐపీఎల్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించిన ధోని.. ఈ ప్రోమోలో బస్సు డ్రైవర్‌ అవతారంలో మెరిసాడు. అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ గా మహేంద్రసింగ్‌ ధోనీ స్థానంలో ఆల్‌ రౌండర్‌ జడేజా ఉండటం గమనార్హం.

https://www.facebook.com/alltimereport/videos/477876967260715

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఈసారి రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి. అలాగే 25 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.