ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12, 13 తేదీలలో మెగా వేలం జరగనుంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రొచైంజ్ లు వచ్చిన విషయం తెలిసిందే. లక్నో టీమ్‌కు ‘లక్నో సూపర్‌జెయింట్స్’ అని పేరు పెట్టగా..తాజాగా అహ్మదాబాద్ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ అని పేరు పెట్టారు.
అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ ఐపీఎల్ ను కొత్తగా ప్రారంభించాలని చూస్తుంది. అందుకే చాలా మంది ఆటగాళ్లును కూడా దూరం పెట్టింది. కోచ్ లను మార్చింది. తాజాగా జెర్సీని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మార్చింది. కొత్త జెర్సీని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
జెర్సీ మొత్తం ఆరెంజ్ రంగుతోనే ఉంచారు. అలాగే ప్యాయింట్ కూడా ఆరెంజ్ రంగులోకి మార్చేశారు. ఆరెంజ్ ఆర్మీ అనే పేరుకు తగినట్టుగా జెర్సీని రూపొందించారు. కాగ గత ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ దారుణమైన ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది. దీంతో సన్ రైజర్స్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పూర్తి మార్పులు చేసింది.