అఖిల్ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ – మేకర్స్ ప్లాన్

Hero Akhil has two films back to back

0
93

అక్కినేని అఖిల్ సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ కరోనా వల్ల ఆయన సినిమా రాక కూడా ఆలస్యం అయింది. అయితే ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానుల్లో ఆ ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఇక తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈచిత్రంలో అఖిల్ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్టులుక్ బయటకి వచ్చిన దగ్గర నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో 24 వ తేదిన విడుదల కానుంది. ఈ విషయం మేకర్స్ ముందే చెప్పారు.

ఇక కరోనా వల్ల చాలా సినిమాలు విడుదల మార్చుకుంటున్నాయి. కొన్ని దసరా బరిలోకి, మరికొన్ని దిపావళి బరిలోకి ,మరికొన్ని డిసెంబరుకి చేరుతున్నాయి. అయితే ఏజెంట్ సినిమా విడుదల తేదీ మారుతుందేమో అనే టాక్ నడిచింది. కానీ మేకర్స్ మాత్రం డిసెంబర్ 24 వ తేదిన చిత్రం విడుదల చేయాలి అని స్ట్రాంగ్ గా ఉన్నారట. ఈ లోగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.