15 ఏళ్ల క‌ల నెర‌వేరింది – హీరో అర్జున్

Hero Arjun Emotional Comments on His life

0
111

మ‌న సౌత్ ఇండియాలో యాక్షన్ కింగ్ అంటే వెంట‌నే చెప్పే పేరు అర్జున్ సార్జా. ఆయ‌న చిత్రాలు అన్నీ సూప‌ర్ హిట్ అనే విష‌యం తెలిసిందే.అర్జున్ ఆంజనేయస్వామిని ఎంతో భక్తితో కొలుస్తారు. తాజాగా ఆయ‌న ఆ హ‌నుమంతుడికి ఓ ఆల‌యం నిర్మించారు. చెన్నైలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో ఆంజనేయుడికి ఆలయాన్ని కట్టించారు.

ఈ ఆలయ నిర్మాణ పనులు 15 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 15 ఏళ్ల క‌ల నెర‌వేరింద‌ని ఈ విష‌యం తెలియ‌చేశారు అర్జున్. ఆల‌యంలో జులై 1న కుంభాభిషేకం జరగనుంది. ఈ నూత‌న ఆలయ ప్రారంభోత్సవం గురించి అర్జున్ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు.

15 ఏళ్ల క్రితం చెన్నైలో ప్రారంభించిన ఈ ఆల‌య నిర్మాణం పూర్తి అయింది. జులై 1, 2 తేదీల్లో కుంభాభిషేకాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. అభిమానులు, స్నేహితులు, తనకు తెలిసిన వాళ్లందరినీ పిల‌వాలి అని అనుకున్నా, కాని క‌రోనా వ‌ల్ల ఎవ‌రినీ ఆహ్వానించ‌డం లేదు, అయితే దీనిని ఎవరూ మిస్ అవ్వ‌కూడ‌దు అని లైవ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆ లైవ్ లింక్ ని అంద‌రు ఇన్ స్టాలో చూడ‌వ‌చ్చు అని తెలిపారు.