ఐపీఎల్​ కొత్త జట్టు కోసం ఆ హీరో, హీరోయిన్ బిడ్..!

Hero, heroine bid for IPL new team ..!

0
119

వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్​ అభిమానుల్లో సరికొత్త జోష్​ నింపనుంది. 2022 లీగ్​లో పది టీమ్​లు పాల్గొంటాయని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు రెండు కొత్త టీమ్​ల కోసం ఇటీవలే టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈ ఫ్రాంచైజీలను సొంతం చేసుకునేందుకు స్వదేశీ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్​ స్టార్​ కపుల్ రణ్​వీర్ సింగ్-దీపికా పదుకొణె జంట కూడా ఓ ఫ్రాంచైజీని కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఓ ఫ్రాంచైజీ ఫుట్​బాల్​ క్లబ్ ‘మాంచెస్టర్​ యునైటెడ్’​ కూడా బీసీసీఐ నుంచి టెండర్​ పత్రాలు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఐపీఎల్​ జట్ల కొనుగోలుపై నటీనటులు ఆసక్తి చూపడం కొత్తేం కాదు. ఇప్పటికే ప్రీతి జింతా, షారుక్​ ఖాన్.. పంజాబ్​, కోల్​కతా జట్లకు సహయజమానులుగా ఉన్నారు. కోల్ కతా ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్ గా నిలవగా, పంజాబ్ ఒక్కసారి టైటిల్ కొట్టలేకపోయింది.