మరో తమిళ దర్శకుడి కథకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ?

hero ram charan new movie with tamil director

0
136

 

హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకుడు శంకర్ తో సినిమాని కూడా ప్రకటించారు. ఇక పలువురు దర్శకులు చరణ్ కి కధలు వినిపిస్తున్నారు. ఇక కొత్త దర్శకుల కథలు కూడా వింటున్నారు చరణ్. తాజాగా మరో తమిళ దర్శకుడు కథని కూడా రామ్ చరణ్ ఒకే చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి కోలీవుడ్ లో.

రామ్ చరణ్ – శంకర్ మూవీ తర్వాత మరో తమిళ డైరెక్టర్ ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, చెర్రీ ఓ సినిమా చేయడానికి సిద్దం అవుతున్నారట. కార్తీ నటించిన ఖైదీ సినిమాతో ఆ దర్శకుడికి ఎంతో మంచి పేరు వచ్చింది. ఇక సూపర్ టేకింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేయాలని తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట ఆయన. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్ధ నిర్మించడానికి ప్లాన్ చేస్తోందట. మరి చూడాలి దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.