హోల్డర్ అద్భుతం..చివరి 4 బంతుల్లో 4 వికెట్లు..వెస్టిండీస్ ​విజయం

Holder Awesome..4 wickets in last 4 balls..West Indies win

0
127

ఇంగ్లాండ్​తో జరిగిన టీ20లో వెస్టిండీస్ ​విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 5 టీ20ల సిరీస్​ను 3-2తేడాతో విండీస్​ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్​ విజయంలో జేసన్​ హోల్డర్​ కీలకంగా వ్యవహరించాడు. చివరి ఓవర్​లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. హోల్డర్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు వరించింది.

180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్​ కేవలం 19.5 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్​ బ్యాటరల్లో జేమ్స్​ విన్స్​(55), బిల్లింగ్స్​(41) టాప్​ స్కోరర్. మిగతా వారు విఫలమయ్యారు. విండీస్​ బౌలర్లలో హోల్డర్​ 5, అకీల్​ హొసేన్ 4 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్​కు చేసిన వెస్టిండీస్​ నిర్ణీత 20 ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి 179 రన్స్​ చేసింది. కెప్టెన్​ పొలార్డ్​(41), రోవ్మన్​ పొవెల్​(35), బ్రాండన్​ కింగ్​(34) రాణించారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో ఆదిల్​ రషీద్​, లివింగ్​స్టోన్​ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.