టీమిండియా​కు ఆ గండం..అధిగమించేదెలా?

How can that husband overcome Teamindia?

0
86

టీ20 ప్రపంచకప్​లో పొగమంచు సమయంలోనూ ఎవరైతే గొప్పగా బౌలింగ్ చేయగలరో వారికే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు టీమ్ ఇండియా కోచ్​ రవిశాస్తి. ఈ సీజన్​లో టీమ్​ఇండియా అన్ని మ్యాచ్​లు దాదాపు సాయంత్రం సమయంలోనే అడనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా అక్టోబర్​ 24న పాకిస్థాన్​తో తన తొలి మ్యాచ్​ ఆడనుంది. ఈ సీజన్​లో టీమ్​ఇండియా అన్ని మ్యాచ్​లు దాదాపు సాయంత్రం సమయంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో పొగమంచు ఆటపై ప్రభావం చూపనుంది. దీనిపై టీమ్​ఇండియా కోచ్ రవి శాస్త్రి స్పందించారు. పొగమంచు అధికంగా ఉంటే పేసర్లను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. వార్మప్ మ్యాచ్​లోనే ఈ విషయాన్ని గ్రహించిన్నట్లు వెల్లడించారు.

మ్యాచ్​పై మంచు ఎంత మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై ఆధారపడి మొదట బౌలింగ్​/బ్యాటింగ్ ఏది తీసుకోవాలో నిర్ణయించుకుంటాం. దీనికి అనుగుణంగానే స్పిన్నర్ల/ ఫేసర్లను ఎవరిని బరిలోకి దించాలో తేలుస్తాం అని కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ తెలిపారు.