సినిమా నటులకి క్రీడాకారులకి ఎంత మంది అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటారు. అందుకే ఈ నటులు క్రీడాకారులు ఎక్కడకైనా వెళితే కచ్చితంగా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక వారి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ల కోసం ఏకంగా కోట్ల రూపాయల జీతాలు ఇస్తున్నారట. మరి మన బాలీవుడ్ సెలబ్రెటీలు బాడీగార్డ్స్ కి ఎంత జీతాలు ఇస్తున్నారు అనేది కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఎంతో చూద్దాం.
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె బాడీగార్డ్ పేరు జలాల్. అతనికి ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం ఇస్తున్నారట.
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, క్రికెటర్ విరాట్‌కోహ్లీ ఆయన సతీమణి అనుష్క కూడా వారి బాడీగార్ట్స్ కి భారీగా జీతాలు ఇస్తున్నారట.
షారుఖ్ తన బాడీగార్డ్ రవిసింగ్‌కు ఏడాదికి రూ.2.7 కోట్ల రూపాయలు.
సల్మాన్‌ఖాన్ బాడీగార్డ్ షేర్నాకి ఏడాదికి సుమారు రూ.2 కోట్ల రూపాయలు.
విరాట్‌కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్కశర్మ బాడీగార్డ్ ప్రకాశ్‌కు రూ.1.2 కోట్ల జీతం ఇస్తున్నారని టాక్ . వీళ్ల జీతాలు పెద్ద పెద్ద సాప్ట్ వేర్ కంపెనీల సీఈవోల జీతాలతో సమానం అంటున్నారు ఈ వార్త విన్నవారు.