ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇటు టీమ్ లు సిద్దం అవుతున్నాయి, ఇక ఆటగాళ్లు పోటికి సిద్దం అవుతున్నారు. ఈసారి ఊహించని విధంగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సీజన్ లో సచిన్ తనయుడు అర్జున్ కూడా తన లక్ పరిశీలించుకోనున్నారు.
చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న వేలం జరగనుంది. ఇప్పటికే 1097 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక మన ఇండియన్ ప్లేయర్స్ 21 మంది అలాగే విదేశీ ఆటగాళ్లు 207 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు…ఈ సీజన్ కి సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా పేరు నమోదు చేసుకున్నాడు.
అతని కనీస ధరను 20లక్షలు నిర్ణయించారు. దీంతో అతను ఎంత ధరకు పలుకుతాడు అతన్నీ ఏ టీమ్ తీసుకుంటుంది అనేది బాగా ఎదురుచూస్తున్నారు అందరూ… మరీ ముఖ్యంగా సచిన్ కుమారుడి ఆట చూడాలి అని కూడా అతని అభిమానుల కోరుకుంటున్నారు…కేరళ ఆటగాడు శ్రీశాంత్ సైతం ఈ వేలంలో ఉన్నారు,అతనికి 75 లక్షలు కనీస ధర ఫిక్స్ చేశారు.