Flash- భారీ షాక్‌..ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్

Huge shock..Corona positive for all three players

0
98

వెస్టిండీస్‌ జట్టుకు భారీ షాక్‌. పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బంది ఒకరికి కరోనా నిర్ధరణ అయినట్లు విండీస్‌ బోర్డు ప్రకటించింది. పాకిస్థాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు కరీబియన్‌ జట్టు గురువారం కరాచీకి చేరుకుంది.

ఈ క్రమంలోనే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా రోస్టన్‌ ఛేజ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, కైల్‌ మేయర్స్‌తో పాటు మరో వ్యక్తి వైరస్‌ బారినపడినట్లు తేలింది. దీంతో వీరిని ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించినట్లు ఆ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.