ఐసీసీ తాజా మహిళా టీ20 ర్యాంకింగ్స్ విడుదల అయ్యాయి. ఇందులో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షెఫాలీ వర్మ (726 పాయింట్లతో) మళ్లీ ఫామ్లోకి వచ్చింది. స్మృతి మంధాన(709) ఓ స్థానం కిందకి పడిపోయి నాలుగో ర్యాంకులో నిలిచింది.
బెత్ మూనీ(724), మెగ్ లానింగ్(714) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. శ్రీలంక ప్లేయర్ చమారీ అటపత్తు(632) ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి దూసుకొచ్చి ఎనిమిదో స్థానంలో నిలిచింది. బౌలింగ్ విభాగంలో దీప్తిశర్మ(658) నాలుగో స్థానంలో ఉండగా.. రాజేశ్వరి గైక్వాడ్(637) పదో ర్యాంకులో నిలిచారు. తొలి రెండు స్థానాల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సోఫీ ఎక్లీస్టోన్(761), సారా గ్లెన్(122) ఉన్నారు.
ఆల్రౌండర్ విభాగంలో దీప్తి శర్మ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. 315 పాయింట్లతో మూడో ర్యాంకుకు చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో సోఫీ డివైన్(న్యూజిలాండ్, 370 పాయింట్లు) నటాలి సీవర్(ఇంగ్లాండ్, 352 పాయింట్లు) ఉన్నారు.