హార్దిక్ లేకపోతేనేం..శార్దూల్ ఉన్నాడుగా: మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా

If not Hardik..Shardul is there: Former opener ‌Akash Chopra

0
307

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. దీని గురించి ఆకాశ్‌ స్పందించాడు.

ఆల్‌రౌండర్‌ స్థానం విషయమై హార్దిక్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకూర్‌ను పోలుస్తూ మాట్లాడాడు. హార్దిక్‌ పాండ్య నుంచి టీమ్‌ఇండియా ఆశించిన దాన్ని శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. “బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకూర్‌ను పోల్చడం సరికాదు. బ్యాటింగ్‌ పరంగా చూస్తే పాండ్య చాలా ముందున్నాడు.

పాండ్య భారీగా పరుగులు చేయగలడు. ఇక బౌలింగ్‌లో హార్దిక్‌ కన్నా శార్దూల్‌ మెరుగ్గా ఉన్నాడు. మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొడుతున్నాడు. శార్దూల్‌ రెండో టెస్టులో చేసిన ప్రదర్శన అత్యద్భుతం. ఏడు వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌ 24 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఆ పరుగులు చాలా కీలకం అని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు.