గర్భంతో ఉన్న సమయంలో వీటిని వాడితే ప్రమాదం పొంచివున్నట్లే..

0
106

లోకంలో అమ్మ ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదని అందరికి తెలిసిందే. స్నేహితుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ ఇలా  ఎవ్వరిప్రేమైన అమ్మ ప్రేమ ముందు తలొంచాల్సిందే. అందుకే మహిళలు గర్భం దాల్చిన మొదలు ప్రసవం అయ్యేవరకు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో తెలియక చేసే తప్పుల వల్ల చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

చాలామంది తెలియక బాడీకి  వివిధ కాస్మోటిక్స్ రాసుకుంటారు. గర్భంలో శిశువు సురక్షితంగా ఉండాలంటే కాస్మోటిక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సౌందర్య సాధనాలు, క్లీనింగ్ ఏజెంట్లు, మందులకు వాడడం వల్ల శిశువు మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కావున ప్రెగ్నెన్సీ సమయంలో వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.

ఒకవేళ లిప్ స్టిక్, లిప్ గ్లాస్, లిప్ బామ్, ఐలైనర్స్, మస్కారాస్, డియోడరెంట్స్, ఫౌండేషన్, నెయిల్ పాలిష్, బాడీ ఆయిల్, టాల్కమ్ పౌడర్, హెయిర్ రిమూవల్ ప్రొడక్ట్స్ వాడినట్లయితే నెలలు నిండక ముందే ప్రసవం కావడం ఇలా పలు రకాలసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వాటికీ బదులుగా కొబ్బరి నూనె, అలోవెరా జెల్ ఇలాంటివి వాడితే శిశువుకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది.