ఓ వ్యక్తి హృదయంతో నేను ప్రేమలో పడ్డాను – ఇలియానా

ఓ వ్యక్తి హృదయంతో నేను ప్రేమలో పడ్డాను - ఇలియానా

0
123

ఇలియానా ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. వీలు దొరికినపుడు. లేదంటే వీలు చేసుకుని మరీ… తమ ప్రేమను తెలియజేసేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఓ నెటిజన్‌కి ఇవన్నీ తెలియవనుకుంట! బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకుల ప్రశ్నలకు ఇలియానా సమాధానాలు ఇస్తున్న సమయంలో ‘మీరు ఆండ్రూని ప్రేమిస్తున్నారా?’ అని అడిగారు. ‘‘పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నా. అయామ్‌ మ్యాడ్‌లీ ఇన్‌ లవ్‌ విత్‌ ఆండ్రూ’’ అని పేర్కొన్నారామె.

తర్వాత ఇంకో నెటిజన్‌ ‘మీ జీవిత భాగస్వామిగా ఒక విదేశీయుణ్ణి ఎందుకు ఎంపిక చేసుకున్నావ్‌?’ అని అడిగారు. దానికి ఇలియానా కొంచెం ఘాటుగానే స్పందించారు. ‘‘ఓ వ్యక్తి హృదయంతో నేను ప్రేమలో పడ్డాను. అతని రంగు రుచి చూడలేదు. అతనిది ఏ దేశమని ఆలోచించలేదు. స్కిన్‌ కలర్‌ లేదా నేషనాలిటీ విషయాలను నేను పట్టించుకోను’’ అని ఇలియానా అన్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రంలో ఈమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత తెలుగులో చేస్తుండటంతో కాస్త నెర్వస్‌గా ఉందని ఇలియానా తెలిపారు.