ఇమ్రాన్ తాహిర్ మంచి ఆటగాడు ఐపీఎల్ 2019లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సాధించిన ఇమ్రాన్ తాహిర్కు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అయితే ఈ ఏడాది 2020 ఐపీఎల్ లో మాత్రం ఇమ్రాన్ తాహిర్ కు చెన్నై తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.దీంతో అభిమానులు కూడా కాస్త డీలా పడ్డారు.
ప్రస్తుత సీజన్లో ఆటగాళ్లకు నీళ్ల సీసాలు, డ్రింక్స్ అందిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ తాహిర్ మాత్రం తాను డ్రింక్స్ అందించండం ఏంటని ఫీలవ్వకపోగా ఇది నా బాధ్యత అంటున్నాడు, నేను నా టీమ్ విజయం కోసం చూస్తాను నేను ఆడిన సమయంలో చాలా మంది ఆటగాళ్లు ఇలా డ్రింక్స్ అందించారు. ఇందులో తప్పు ఏమీ లేదు అని అన్నాడు తాహిర్.
నేను ఆడుతున్నానా లేదా అనేది కాదు.. నా జట్టు గెలుస్తుందా లేదా అనేదే ముఖ్యం. ఒకవేళ నాకు ఆడే అవకాశం వస్తే.. బాగా ఆడటానికి ప్రయత్నిస్తాను అని ట్వీట్ చేశాడు, దీంతో చెన్నై అభిమానులు సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ జట్టులో ఎందుకు లేడు అంటే, తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలన్న నిబంధన కారణంగా..
తాహిర్కు ఈ సీజన్లో చెన్నై ఇప్పటి వరకూ అవకాశం ఇవ్వలేదు.