ఇండియా అమ్మాయితో గ్లెన్ మ్యాక్స్ వెల్ వివాహం

ఇండియా అమ్మాయితో గ్లెన్ మ్యాక్స్ వెల్ వివాహం

0
95

గ్లెన్ మ్యాక్స్ వెల్ ఈ ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్.. ఐపీఎల్ లో మెరిపించిన మెరుపులు ఎవరూ మర్చిపోలేరు అంతేకాదు అతనికి భారత్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు స్టైలిష్ లుక్ లో ఉంటాడు ఎప్పుడూ…గ్లెన్ మ్యాక్స్ వెల్ కి లేడీ ఫ్యాన్స్ కూడా చాలా మందిఉన్నారు

ఇప్పుడు మ్యాక్స్ వెల్ భారతీయులకు మరింత దగ్గర కానున్నాడు. అవును మన దేశానికి చెందిన యువతిని వివాహం చేసుకోబోతున్నాడట, అంటే భారతీయ కుటుంబంతో సంబంధం కలుపుకుని వివాహం చేసుకుంటున్నాడు, ఇక ఇటీవల ఇరుకుటుంబాలు కలిసి ఎంగేజ్ మెంట్ చేశారట.

ఆ అమ్మాయి పేరు విని రామన్, వీరి కుటుంబం చాన్నాళ్ల కిందట ఆస్ట్రేలియాలో స్థిరపడింది. విని రామన్ మెల్బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వెళ్లిన పార్టీలతో వీరి మధ్య లవ్ ట్రాక్ ఉంది అని అందరూ భావించారు.. చివరకు అదే నిజమైంది, ఇక వారి వివాహానికి భారత క్రికెటర్లను కూడా అతను ఆహ్వానిస్తాడట.