భారత బౌలర్లు భళా..మొదటి రోజు ఇండియాదే!

0
109

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆ సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 86/6తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక ఇంకా 166 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు, మహ్మద్‌ షమి రెండు, అక్షర్‌ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ (92; 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రిషభ్ పంత్ (39; 26 బంతుల్లో 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా మూడు, జయవిక్రమ మూడు, ధనంజయ రెండు, లక్మల్‌ ఒక వికెట్ పడగొట్టారు.