భారత స్టార్‌ షట్లర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్ పై గురి

Indian star Shutler aims for French Open title

0
104

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీపై దృష్టి సారించింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్​లో జూలీ జాకోబ్‌సెన్​తో (డెన్మార్క్‌) మూడో సీడ్‌ సింధు తలపడుతుంది. డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్‌పైనల్లో నిరాశపరిచిన పి.వి సింధు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌పై గురి పెట్టి పెట్టింది.

మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్​లో సయాక తకహాషితో (జపాన్‌) పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్​లో టాప్‌ సీడ్‌ కెంటొ మొమొటతో (జపాన్స్‌) శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌తో సాయి ప్రణీత్‌, జొనాథన్‌ క్రిస్టీతో (ఇండోనేసియా) సమీర్‌వర్మ, బ్రైస్‌ లెవెర్‌దెజ్‌తో (ఫ్రాన్స్‌) కశ్యప్‌ తలపడతారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు 2019 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్లేయర్ అవార్డు ను సొంతం చేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో భాగంగా సింధును ఈ ఏటి మేటి క్రీడాకారిణిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.