హార్దిక్ పాండ్యా గాయంపై పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Interesting comments by former Pakistan pacer on Hardik Pandya injury

0
96

టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో కొంతకాలంగా ఇబ్బందిపడుతున్నాడు. దీనితో జట్టులో చోటు కష్టం అయింది. తాజాగా హార్దిక్ పాండ్యా గాయంపై పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు.

దుబాయ్​లో ఓ సమయంలో పాండ్యను, బుమ్రాను నేను కలిశాను. వారితో మాట్లాడాను. వాళ్లను చూస్తుంటే బక్కపలచగా ఉన్నారు. వాళ్ల వెన్నెముకలు కూడా బలంగా లేవని అనిపించింది. అప్పుడు పాండ్యా తీరికలేని విధంగా క్రికెట్‌ ఆడుతున్నట్లు చెప్పాడు. నువ్వు త్వరలోనే గాయపడతావని అతడిని హెచ్చరించా. నేనెలా చెప్పిన గంటన్నరకే అతడు గాయపడ్డాడు” అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో, టీ20 ప్రపంచకప్‌లో పాండ్య విఫలమయ్యాడు. ఇక తాజాగా ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనకూ అతడిని ఎంపిక చేయలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత పాండ్యా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.