ఎమ్మెస్ ధోనీ ఎంత గొప్ప క్రికెటరో తెలిసిందే. మిస్టర్ కూల్ మంచి ఫినిషర్ గా పేరు సంపాదించుకున్నాడు. టెస్ట్ వన్డే టీ 20 ఇలా ఏ మ్యాచ్ అయినా ,సిరీస్ అయినా ధోనీ ఆటమాత్రం వరల్డ్ క్లాస్ గా ఉంటుంది. అందుకే మన ఇండియన్సే కాదు విదేశీ ఆటగాళ్లు క్రీడా అభిమానులు అతన్ని ఇష్టపడతారు.
క్రికెట్ కెరీర్లో సక్సెస్ ఫుల్ కెప్టెన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే ధోనీ ఈ స్దాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. తాజాగా
మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరె కొన్ని విషయాలు వెల్లడించారు.
2003-04 దులీప్ ట్రోఫీ ఫైనల్లో దీప్దాస్ గుప్తా బదులు ఎమ్మెస్ ధోనీని ఆడించడానికి ఈ టీమ్ ప్రయత్నించింది, ఈ సమయంలో కెప్టెన్ గా దాదా అంటే సౌరవ్ గంగూలీ ఉన్నారు, అయితే గంగూలీ మాత్రం దీప్ దాస్ నే ఫైనల్ అని చెప్పాడు.
అప్పటికే ఇండియన్ నేషనల్ టీమ్కు రెగ్యులర్ వికెట్ కీపర్ లేడు. బ్యాట్స్ మన్ గా ఉంటూ కీపర్ గా ద్రవిడ్ ఉన్నాడు . ఈ సమయంలో అంత ఒత్తిడి అతనిపై ఉండకూడదు అని భావించాం, అప్పుడు ధోనీ ఆటచూశాం అతన్ని తీసుకుందాం అని అనుకున్నాం. మొత్తానికి ఇలా గంగూలీని పది రోజుల పాటు బ్రతిమలాడితే దాదా ఒప్పుకున్నారట.