ఐపీఎల్ 2020 లో ఆటగాళ్లు ఒకరికి ఒకరు ఈ మధ్య సరదాగా బహుమతులు ఇచ్చుకుంటున్నారు, ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు, నిన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై పై రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆది నుంచి చెన్నై కాస్త తడబడింది, భారీ స్కోరింగ్ చేయలేకపోయింది, ఇక రాజస్ధాన్ సింపుల్ గా దీనిని చేజ్ చేసింది.బట్లర్, స్మిత్ లు టీమ్‌కు అండగా.. నిలువడంతో సునాయాసంగా గెలుపొందింది.
జోస్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సమయంలో బాగా ఆడినందుకు తన జెర్సీని బట్లర్‌కు బహూకరించాడు ధోనీ . బట్లర్‌కు ధోనీ అంటే అమితమైన అభిమానం.
ఇక పలుసార్లు ఇంటర్వ్యూలు మ్యాచుల్లో బట్లర్ చాలా సార్లు చెప్పాడు, దీంతో ధోనీ ఇలా ఇవ్వడంతో తను చాలా ఆనందించాడు, ధోని మ్యాచ్ ఫినిషింగ్ చేసే విధానం చాలా మందికి నచ్చుతుంది మిస్టర్ కూల్ అనే పేరు ఆయనకు అలాగే వచ్చింది.